FaithWalk
← Back to Library

#203సిలువ మోయు యేసు

Author: రావూరి రంగయ్యComposer/Ragam: ముఖారి (ఛాయ: కలుగును గాక)Category: క్రీస్తు శ్రమలు — మరణము
ప
ఎందుబోయెదవో – హా ప్రభురాయ ఎందుబోయెదవో ఎందు బోయెదవయ్య – ఈ దుర్మానవశ్రేణి – బొందదగిన భారంబు బూని రక్షక నీవు ||ఎందు||
1.
వడగాలిలోను – నీ మోము – వాడికందగను – నొడల జెమటయు నీరు – నొడిసివరదై పార – నడుగులు తడబడ – నయ్యా యిప్పుడు నీవు ||ఎందు||
2.
మూపుపై సిలువ శత్రుస్ – మూహముల్ నడువన్ – కాపు ప్రచండముగను కా రెంటి కాయగ – నేపున నా పాప – మీ పాటు పెట్టగ ||ఎందు||
3.
విరుపులు గట్టివియో – జనుల రక్షించు – బిరుదులయ్యవియో పరమ రక్షకుండ నా – పాపబంధము లవియో – పరిశోధించెడి వారి – పట్టుకొమ్మలవియో ||ఎందు||
4.
ఆకాశమందు – దూతలు కొల్వ – నతితేజమొందు – ప్రాకటమైనట్టి నీ సదవనముల్ పగలురాల – తాకున బలియెర – రక్త ధారలొల్కగను ||ఎందు||
5.
పరమమందు గల – పరిమళముచే – బసముంచి వెలయు చిరమౌ దేహమునకు నా – యెరూషలేమను నట్టి – పురములోపలి మన్ను – పూతమయ్యెనా ప్రభువా ||ఎందు||
6.
ఒక పాలివెతలా – రవ్వంతైనా – సుకరమౌ స్థితులా యక్కటా చెదరి గుండె – లదరి రుషులు రుషులమన – యొక్కటి బొందక తాప – మొంది కుందునే కర్త ||ఎందు||