FaithWalk
← Back to Library

#20ప్రత్యేక దేవుని స్తుతి

Author: యెషయా వీరమార్టిన్Composer/Ragam: శంకరాభరణముCategory: దైవారాధన — దైవస్తుతి
ప
పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా వరదూత లైన నిన్ వర్ణింపగలరా ॥పరిశుద్ధ॥
1.
పరిశుద్ధ జనకుడా పరమాత్మరూపుడా నిరుపమ బలబుద్ధి నీతి ప్రభావా ॥పరిశుద్ధ॥
2.
1పరిశుద్ధ తనయుడా నరరూపధారుడా నరులను రక్షించు కరుణా సముద్రా ॥పరిశుద్ధ॥
3.
పరిశుద్ధమగు నాత్మ వరములిడు నాత్మ పరమానంద ప్రేమ భక్తుల కిడుమా ॥పరిశుద్ధ॥
4.
జనక కుమారాత్మలను ఏక దేవా ఘన మహిమ చెల్లును దనర నిత్యముగా ॥పరిశుద్ధ॥