#19దేవుని మందిరావరణములు (దావీదు కీర్తన 84)
Author: ఎం. జే. రామాంజాచార్యులుComposer/Ragam: హిందూస్థానీ ముఖారిCategory: దైవారాధన — దైవస్తుతి
ప
చూడ గోరెద దేవ మందిరావరణములను చూడ గోరెద
చూడ నాకు నాశ గలదు సుందరావరణములవి
చూడ నాదు ప్రాణమెంతొ సొమ్మసిల్లుచున్నదహా ॥చూడ॥
1.
నీదు నివాసములు చూడ నెంతో రమ్యమై
తనర నాదు హృదయమునకు నానందమిచ్చు
నెప్పుడు నెప్పుడు ॥చూడ॥
2.
జీవము గల ప్రభుని చూడ జీవి నాలో కేక
వేసె కోవెలలకు దొరికె గూటి తావు నీ మందిరమున ॥చూడ॥
3.
పిచ్చుకలకు దొరికె స్థలము ముచ్చట బలిపీఠ
మెదుట పెట్టుకు తూహలముతోను పిల్లల నవి మందిరమున ॥చూడ॥
4.
నీదు మందిరంబులోన నిత్య వాసులైన
వారు నిక్కముగను ధన్యులగుచు నిన్ను నుతింతురహా ॥చూడ॥
5.
ప్రభుని వలన బలము నొందు ప్రజలు
ధన్యులగుదు రిల ప్రాణ ప్రియము యాత్ర చేయు
ప్రజల మార్గమమర ధరణిను ॥చూడ॥
6.
నీదు యావరణములలో నేను నొక్క దినము గడుప
నెంతో విలువ గల నాకు వేయినాళ్ల బ్రతుకు కన్న ॥చూడ॥
7.
కానరారు మనము నిప్పుడైన మనము లలర ప్రభుని
చూడ మందిరమున కేగి నిండు మనశ్శాంతి బొంది బ్రతుక ॥చూడ॥