FaithWalk
← Back to Library

#2దేవుడు సర్వస్తోత్ర పాత్రుడు

Author: విలియం డాసన్Composer/Ragam: ఆనందభైరవి (ఛాయ: యెహోవా భజన)Category: దైవారాధన — దైవస్తుతి
ప
గానము చేయుడి సుకీర్తనను యెహోవాను గూర్చి క్రొత్త గానము రక్తిగను ॥గానము॥
1.
తన నామమును నుతించి యతని రక్షణ జెన్నుగ సాటెడి ప్రసిద్ధము జేసి పన్నుగ నన్యులలో దన మహిమ యందున్నత చిత్రములను చాటండి ॥గానము॥
2.
ఘనతయు మహత్త్వమును దన యెదుటనుండు ఘనబలమును వినతము సౌందర్యమును నతని పరిశుద్ధ స్థలమున విలసిల్లు ॥గానము॥
3.
పరిశుద్ధాలంకారముతో నాతని పరమాత్మారాధన పరులై యుండండి ధరణి సకల జనులారా లోక గురుని యెదుట విధి గొనుచునుండండి ॥గానము॥
4.
పరిపాలించుచున్నాడనుచు తోడి నరులతో జెప్పండి ధరణి గదలకుండ స్థిరముగ జేయు సత్యముగా జనుల కిరమురిగాను న్యాయము విమర్శించు ॥గానము॥
5.
ఏమనిన నా మహత్ముండు వచ్చు నీ మహికి న్యాయము నేర్పరచుటకు భూమి జనులకు నీతి సత్యముల తో మించు న్యాయమెంతో విమర్శించు ॥గానము॥
6.
జనులారా యా యెహోవాకు మహి మను బలమును సమర్పణము చేయండి వినయముతో గానుకలను తీసి కొని తత్ప్రకారమందున వసియింపండి ॥గానము॥