FaithWalk
← Back to Library

#1సృష్టికర్త ప్రస్తుతి

Author: బేతాళ జాన్Composer/Ragam: కాంభోజిCategory: దైవారాధన — దైవస్తుతి
ప
అన్ని కాలంబుల నున్న యెహోవా ని నెన్నదరంబయ్యో కన్న తండ్రి మన్నెనెక్కిన మోక్షవాసాల సన్నుతు లున్నతమై యుండ మున్నె నీకు ॥అన్ని॥
1.
నిన్ను ప్రకటన సేయ నిఖిల లోకములను బన్నుగ జేసిన బలుడ వీవె ఉన్న లోకంబుల నుడుగక కరుణా సం పన్నతతో నేలు ప్రభుడ వీవె ॥అన్ని॥
2.
నీవె అన్ని జీవుల నెరిగి యాహార మిచ్చుచు నున్న సర్వజ్ఞుడవు నీవె ఎన్న శక్యముగాక యున్న లక్షణముల సన్నుతించుటకు నే జాలదూరను ॥అన్ని॥
3.
పుట్టించి మమ్మీవు పెంచి పోషించి మమ్మీ గిట్టించి మమ్మీవు త్రిప్పితివనుచు నట్టి పనికి మాలి నట్టి మానవుల చే పట్టి రక్షింప నీ బాధ్యుండవంచు దట్టమైన కృపను దరిజేర్చ నాకిచ్చి పట్టరై నిలిచియుందు ప్రభుడ వీవె గట్టెడి కట్టచే గెడముట్టదనుకొనక పట్టుకొలది నిన్ను ప్రస్తుతింతు ॥అన్ని॥
4.
కారుణ్యనిధి వీవు కీడు నాథుడను నేను భూరి శుద్ధుడవు నీవు పాపి నేను సార భాగ్యుడవు నీవు జగతి లో నాకన్న దారిద్రుడే లేడు తరచి చూడ సార సద్గుణముల సంపన్నుడవు నీవు ఘోర దుర్గుణ సంచారి నేను ఏ రీతి స్తుతియింతు నే రీతి సేవింతు నేరమెన్నక ప్రోవ నెర నమ్మితి ॥అన్ని॥