FaithWalk
← Back to Library

#3యేసు సహాయమునకై ప్రార్థన

Author: గొల్లపల్లి నతానియేలుComposer/Ragam: మాళవ (ఛాయ: తనువు నాదిదిగో)Category: దైవారాధన — దైవస్తుతి
ప
యేసు నాయకుడా యెల్ల వేళలను నీ దాసుల నేలుమయ్యా మోసముల అన్నిటిమునగ ద్రోతునని బాసలు జేసిన ప్రభుడవు నీవెగా ॥యేసు॥
1.
రేయింబగలు మా న్యాయము చెరిపెడి మాయా పిశాచిని ద్రోయుమి దూరము బాయక భక్తుల జేరు విడువని బహు శ్రేష్ఠుడవు నీవెగా ॥యేసు॥
2.
హృదయము లోకము మది పాపము మమ్ము సతతము శ్రమ పెట్టును సదయుడ మమ్మును వదలక నిత్యము మది తలపులలో మహిమగ నేలుమీ ॥యేసు॥
3.
కాపాడుమి మమ్ము మాపు రేపు నీ శ్రీ పాదములొద్దను ఏ పాపములును ఏలకుండగ నీ ప్రాపున బెంచుము మాపాలకుడవు ॥యేసు॥
4.
మా కొరకై నీ మేనును మ్రానున మేకులతో గొట్టగ మానము మహిమలు మనుజుల కియ్యను భానుడ రాజుగ బ్రతికి లేచితివి ॥యేసు॥
5.
చేను చేనుగా మరి పుట్టుక నీవు పరమున కిలితివి వరముల నిచ్చితివి ధరణిలో నరులకు పరముడ నీ దయ మరువ శక్యమా ॥యేసు॥