#198సిలువ బలము
Author: శెట్టి భానుమూర్తిComposer/Ragam: కురంజిCategory: క్రీస్తు శ్రమలు — మరణము
ప
సిలువే నా శరణాయెనురా – నీ – సిలువే నా శరణాయెనురా
సిలువ యందే ముక్తి బలము – జూపితివిరా ||నీ సిలువే||
1.
సిలువను వ్రాలి యేసు – పలికిన పలుకులందు
విలువలేని ప్రేమామృతము – గ్రోలితిరా ||నీ సిలువే||
2.
సిలువను జూచుకొలది – శిలాసమానమైన మనసు
నలిగి కరిగి నీరగుచున్నదిరా ||నీ సిలువే||
3.
సిలువను దరిసి తరచితి – విలువ కందగ రాని నీ కృప
కలుష మెల్లను బాపగ జాలునురా ||నీ సిలువే||
4.
పలువిధ పదవములరసి – ఫలితమేమి గానలేక
సిలువ యెదుటను నిలిచినాడనురా ||నీ సిలువే||
5.
శరణు యేసు శరణు శరణు – శరణు శరణు నా ప్రభువా
దురిత దూరుడ నీ దరి జేరితిరా ||నీ సిలువే||