FaithWalk
← Back to Library

#197సిలువ ధ్యానము

Author: ఎద్దు దానియేలుComposer/Ragam: నాదనాయకప్రియCategory: క్రీస్తు శ్రమలు — మరణము
ప
అయ్యో నాదగు ఘోర పాపము గదా – భారమై నీపై నొరిగె నెయ్యము వీడి మెస్సయ్య నిన్ సిలువ – కొయ్యపై గొరత కప్పగించిన ||దయ్యో||
1.
నిరతము దూతానీకము గూడగ – నేర్పుచుండ దండ్రి ప్రసన్నుండైయు నిరుపమాన సౌఖ్యముల దేల నిన్ను – బరమునుండి క్రిందికి దిగలాగిన ||దయ్యో||
2.
కోరి నిన్ను గడు పారగనియు గన – లార చూచుకొన నేరనట్టి యల మేరి గర్భమున దూయబడిన కడు – ఘోరమైన ఖడ్గంబు నిజముగ ||నయ్యో||
3.
మోయరాని పెనుకొయ్య నొండు నీ – మూపుపై భారముగ మోపి రయ్యయ్యో యింత బాధ సిలిపినది యూ – దయ్యు వాసు లెంత మాత్రమునుగా ||రయ్యో||
4.
కోలలచే నెన్నెన్నో పెట్టు పెను – గోలగాక యెన్నెన్నో తిట్లు కృప మాలి నీదు వదనమ్ముపై నుమియ – నేల నింత కోపంబు రాదు నిజ ||మయ్యో||
5.
ముండ్లతోడ మకుట మొక్కటె మళ్ళి కడు – మూర్ఛతో నీ తల పైన బెట్టి నీ కొండల కొక్క గంత గడగండ పెట్టి – కారణము నిజముగ ||నయ్యో||
6.
ఈవు ప్రాణమును నీవుగ నొసంగ – నీ దయతోడు ప్రక్కను బొడుచుట హా భావమందున దలపోసి చూడ నల – బంటు గాదు బల్లెంబు గాదు నిజ ||మయ్యో||