#199క్రీస్తు సిలువయే మన మహిమ
Author: విలియం డాసన్Composer/Ragam: ఆనందభైరవి (ఛాయ: నాకై చీలిన యుగ)Category: క్రీస్తు శ్రమలు — మరణము
ప
సిరులెల్ల వృథా కాగా – పరికించి నాకుండ – గురువము దిరస్కరింతును
వర మహిమ రార రాజు – మరణాద్భుతపు సిలువ – నరయుచున్నట్టి వేళన్ – ముఖ్యములైన ||సిరులెల్ల||
1.
ఓ కర్త నా దేవుడు – క్రీస్తు మృతియందు – గాక మరి మురియ హేయము
ప్రాకట భ్రమకారి – వ్యర్థ వస్తువులను – ప్రభుని రక్తంబు కొరకై – త్యజింతును ||సిరులెల్ల||
2.
చారు మస్తక హస్త – పాదములవలన వి – చారంబు దయయు గలసి
సారె ప్రవహించుచున్నది జూడు మెప్పుడట్టి – దారి గలదా ముళ్ళు – తగు కిరీటంబున ||సిరులెల్ల||
3.
వాని నిజ రక్తంబు – వస్త్రంబువలె సిలువ – పైనతని తనువు గప్పె
నైననే నీ లోక – మంతటికి మృతుడనై – యున్న నా హృదయ లోకము – మృతంబయ్యె ||సిరులెల్ల||