#196క్రీస్తు సిలువమీద పలికిన యేడు మాటలు
Author: పంతుగాని పరదేశిComposer/Ragam: హిందుస్తానీ కాపిCategory: క్రీస్తు శ్రమలు — మరణము
ప
ఆహా మహాత్మ హా శరణ్యా – హా విమోచకా
ద్రోహ రహిత చంపె నిను నా – దోషమే గదా ||ఆహా||
1.
"వీరిని క్షమించు తండ్రి – నేర మేమియున్" – కోరి తిటుల నిన్ను జంపు – క్రూర జనులకై ||ఆహా||
2.
"నీవు నాతో పరదై నను – నేడె యుందువు" – పావనుండ రిటుల బలికి – పాపినేలితివి ||వాహా||
3.
"అమ్మా! నీ సుతుడు" – అంచు మరి – యమ్మతో బలికి – క్రమ్మర "నీ జనని" యంచు – గర్త నుడివితివి ||వాహా||
4.
"నా దేవ దేవ యేమి విడ – నాడితివి" – అనుచు శ్రీ దేవు సుతుడు పలికితివి – శ్రమ – చెప్ప శక్యమా ||ఆహా||
5.
"దప్పి గొనుచున్నాను" – అంచును – జెప్పితివి గదా
ఇప్పగించిరి బాధ నొంద – నేమి నీకు హా! ||ఆహా||
6.
శ్రమ ప్రమాదములను గొప్ప – శబ్దమెత్తి హా
"సమాప్తమైనది" – అంచును దెలిపి – సమసితివి గదా ||ఆహా||
7.
"అప్పగింతును దండ్రి నీకు – నా ఆత్మ" – అంచును
గొప్ప యార్భాటంబు చేసి – కూలిపోతివివా ||ఆహా||