FaithWalk
← Back to Library

#195క్రీస్తు శ్రమల ధ్యానము

Author: గొల్లపల్లి నథానియేలుComposer/Ragam: ముఖారి (ఛాయ: పాపము తలచు సుమీ)Category: క్రీస్తు శ్రమలు — మరణము
ప
ఎన్నడు గాంచెదమో – యేసుని – నెన్నడు గాంచెదమో యెన్నడు జూతుము – కన్నె కుమారుని – సన్నుతి జేయుచును ||నెన్నడు||
1.
అంధుల గాచెనట – యెహోవా – నందనుడ్రితడౌనట పొందుగ బాపాత్ములకొర – కై తన – ప్రాణము విడిచెనట ||యెన్నడు||
2.
వేసిరి సిలువనట – క్రీస్తుని – జేసిరి హేళననట ద్రోసిరి యూదులట – బల్లెము – దోసిరి ప్రక్కనట ||యెన్నడు||
3.
చిందెను రక్తమట – పరమ – సంధులు దెల్పెనట నిందల కోర్చెనట – మన దగు – నేరము గాచెనట ||యెన్నడు||
4.
ఆపద కోర్చెనట – పాపపు – మోపులు మోసెనట కోపము మాన్పెనట – యెహోవా – కొడుకై వెలిసెనట ||యెన్నడు||
5.
అక్షయుడ్రితడైనట – జగతికి – రక్షకుడ్రాయెనట దీర్ఘము నమ్మిన నరులం – దరికి ని – రీక్షణ దేవుడట ||యెన్నడు||