FaithWalk
← Back to Library

#194యేసుపై మన దోషము మోపబడెను

Author: జుత్తిగ దావీదుComposer/Ragam: అసావేరి (ఛాయ: ఎందుకైనా డెందమా)Category: క్రీస్తు శ్రమలు — మరణము
ప
యేసునాథుని సిలువపైన – వేసి శ్రమల బోధించినది నా – దోషమే – దుస్సహ – వాసమే ||యేసు||
1.
కంటక కిరీట మౌదల – నంటగొట్టించినది నా చెడు – తలపులే – పాపపు పలుకులే ||యేసు||
2.
మృదు కరంబుల మేకులందింప – నది తలప నా హస్తకృత హకా – ర్యంబులే దుష్క – ర్మంబులే ||యేసు||
3.
పాదయుగమున నాటి చీలలు – బాధ నొందించినది నా చెడు – నడకలే – దోషపు – పడకలే ||యేసు||
4.
దాహము గొన చేదు చిరకను – ద్రావదలచినది మధుర పాన – సఖియే – యందును – రక్తియే ||యేసు||
5.
హెచ్చుగ లోహిత పతనంబుగ – గ్రుచ్చిన కుంతంబు నా పా – పేచ్ఛలే – హృదయదు – రేచ్ఛలే ||యేసు||
6.
పావన గాత్రంబు క్షతమయ – మై వెతల పాలు జేసినది నా – దేహమే – యఘ సంఘ – దాహమే ||యేసు||
7.
దీన్ని గని నా మానసాబ్జము – లోని కలుషము దూరపరచక – నడుతునా – ధారుణి – గడుతునా ||యేసు||