#193సిలువమీది క్రీస్తు
Author: ఒంగోలు అబ్రహాముComposer/Ragam: హిందుస్తానీ కాపిCategory: క్రీస్తు శ్రమలు — మరణము
ప
చూడరే సిలువను వ్రే – లాడు యేసయ్యను
పాడు లోకంబునకై – గోడు జెందె గదా ||చూడరే||
1.
నా చేతులు చేసినట్టి – దోషంబులే గదా
నా రాజు చేతులలో ఘోరంపు చీలలు ||చూడరే||
2.
దురితంపు దలపులే – పరమ గురుని శిరముపై
నెనరు లేక మొత్తెనయ్యో – ముండ్ల కిరీటమై ||చూడరే||
3.
పరుగులెత్తు పాదములు – చేసిన పాపంబులు
పరమ రక్షకుని – పాదములలో మేకులు ||చూడరే||
4.
పాపేచ్ఛతోడు గూడు – నాదు చెడ్డ పడకలే
పరమ గురుని ప్రక్కలోని – బల్లెంపు పోట్లు ||చూడరే||