FaithWalk
← Back to Library

#183క్రీస్తు సిలువ

Author: UnknownComposer/Ragam: ముఖారి (ఛాయ: ఎంతో దుఃఖము బొందితివా)Category: క్రీస్తు శ్రమలు — మరణము
ప
సిలువను మోసితివా – నా కొరకై – కలవరి మెట్లపైకి సిలువ నా యాత్మలో – బలుమారు తలంపగా – దారిమి లేదాయెను – హాయి జాలికి మారుగా – నేనేమి చేయుదు – ప్రేమను మరువజాల ||సిలువను||
1.
ఘోరమైనట్టి యీ – భారమైన సిలువ – ధరించి భుజముపైని నా – దురితములు బాపను – కరుణచే జనుదెంచి – మరణము నొందితివా ||సిలువను||
2.
కలవరి మెట్లపై – కాలు సేతులెల్ల – చీలలతో గ్రుచ్చిపట్టి యా – సిలువకు గొట్టగా – విలువైన నీ మేని – రక్తము ప్రవహించెనా ||సిలువను||
3.
మెట్లపైన నిన్ను – పెట్టిన బాధ నే – బట్టి తలంపగను ఆహా పట్టెను నీ ప్రేమ – నెటుల మరుతును – కష్టములు గలిగినను ||సిలువను||
4.
పంచ గాయములను – నెంచి యాత్మలోన – నుండి తలంపగను హా నా – మించిన దురితములు – ద్రుంచి నన్నెంచిన – క్షమింప వచ్చెను భూమికి ||సిలువను||