#184ఆశ్చర్యకరమైన సిలువ
Author: పురుషోత్తము చౌదరిComposer/Ragam: పున్నాగవరాళి (ఛాయ: ఎంతో సుందరమైనవి)Category: క్రీస్తు శ్రమలు — మరణము
ప
ఏమాశ్చర్యము ప్రియులారా – క్రీస్తు మరణము – ప్రేమ జూడరే మనసార
ఆ మహాత్ముడు మరణ – మగు రీతి గనుగొన్న – సామాన్యమగు నొక్క జనని కంటె గాదు – ఈ మహిని గల పాప జీవులపైన మహా కృప జూపి నిత్య – క్షేమ మొసగెడు కొరకు బలు శ్రమలచే మృతుడైనాడడు స్వేచ్ఛను ||ఏమాశ్చర్యము||
1.
కొండవలె భారమై – లోక పాపములు – దండించబడె ఘోరమై
నిండు భారము క్రింద – నిలుచున్న వేళను – గుండె దిగులున దనువు – నిండె రక్తపు చెమట
మెండుకొని దుఃఖములతో నా – తండ్రి యీ పాత్రను నా కడ – నుండి తొలగించుటకు మనపైన – యుండినను చేయమని వేడెను ||ఏమాశ్చర్యము||
2.
కడు దుర్మార్గులచేతను – క్రీస్తుడు పట్టు – పడె దానంతట తాను
చెడుగు లెందరు నింద – చేసి మోముపై ఉమ్మివేసి – వడి ముళ్ళతో నల్లి – బడిన కిరీటము
తడయక కౌదలు బెట్టి కరముల – నడుగులను సిలువ నిడి మేకులు – దొడిపి ప్రక్కను రక్త జలములు – దొరగ గుంతము గ్రుచ్చిరహహా ||ఏమాశ్చర్యము||
3.
ఇరు పార్శ్వముల నిద్దరి – దొంగలనుంచి – మరణావస్థల బెట్టిరి
నిరపరాధి ప్రభువు – దురితాత్ము లొనరించు – తరుచు బాధల కోర్చి – మరి వారి గమనించి
యెరుంగరై రేమి యునర్చున్నారో యీ – దురిత జీవులు వీరి – నోహో పరమ జనక క్షమించుమని తన – యరుల కొరకై వేడుకొనియెను ||ఏమాశ్చర్యము||