FaithWalk
← Back to Library

#182సిలువలోని దైవ ప్రేమ

Author: బూదాల లేమన్Composer/Ragam: ముఖారిCategory: క్రీస్తు శ్రమలు — మరణము
ప
ఎంతో దుఃఖము బొందితివా – నా కొరకు – ఎంతో దుఃఖము పొందితివా యెంతో దుఃఖము నీకు – ఎంతో చింతయు నీకు – ఎంతో దిగులయ్యా నాకు – ఆ పొంతి పిలాతు యూదులు నీకు బెట్టిన శ్రమలను దలపోయగా ||యెంతో||
1.
వచ్చిరి యూదులు – ముచ్చట లాడుచు – నేచ్చట వాడనుచు నిన్ను – మచ్చరముతో వారి – యిచ్చ వచ్చినట్లు – గొట్టి దూషించినారా ||యెంతో||
2.
సుందరమగు దేహ – మందున దెబ్బలు – గ్రంథములు గట్టినవా నీవు – పొందిన బాధ నా – డెందము తలపన – నందములేదాయెను ||యెంతో||
3.
కొట్టుకొట్టుమని – తిట్టి కేకలు దట్టి – నట్టి నట్టు నెట్టుచును వారు – పెట్టు శ్రమలు తుద – ముట్టను గోరియు – బెట్టిరి వారి ప్రాణము ||యెంతో||
4.
నెపము బెట్టుచు తిట్టి – యపహసించుచు యూద – చపలులు గొట్టి నారా నా – యపరాధములకు నా – పదలను బొంది నీ – కృప నాకు జూపినావా ||యెంతో||
5.
చక్కని నా యేసు – మిక్కిలి బాధ నీ – కెక్కువ గలిగె నయ్యా ఆహా – యొక్క దుష్టుడి ప్రక్కను గ్రుచ్చి తన – యక్కస తీర్చుకొనెనా ||యెంతో||
6.
అన్నదమ్ములైన – అక్క చెల్లెండ్రైన – కన్న పిత్రాదులైన నన్ను – నెన్నడైన ప్రేమించలేరైరి – నా యన్న ప్రేమించినావా ||యెంతో||