#175క్రీస్తు ప్రేమ సాటిలేనిది
Author: విలియం డాసన్Composer/Ragam: మారువCategory: క్రీస్తు జీవితము — ఉపదేశములు
ప
ఏమి లేదు సుమీ జగములో యేసుని – ప్రేమ సారము కన్నను
పామరంబేటికి వృథా కనుదామరలు మూయగనే చీకటి – యాత్మల నెల్ల సత్యము – గామి గని సర్వంబు విడువుము ||రేమి||
1.
దార పుత్రాది బంధు శ్రేణిపై మమ – కార భావము జెందుచు
తద్విషయమై – కోరి దుఃఖము లొందుచు – భ్రమ గొందుచు భూరి
మాయాజాల బంధా – కారమిది యని తెలియక సం – సారమంతయు నాది నాదని – యూరకే చెడిపోవ నేటికి ||నేమి||
2.
ఈ దేహమునకు బ్రాణమునకు సంబం – ధము ఇంచకైనా గలదా
దేహాత్మలకు – భేదము గనవలదా – బుద్ధి గొనవలదా
యాది నా దేహము – నా ఆత్మ స – మాదరంబున నుండునా తనదు – గద్దె ధరిత్రిని విడిచి చనునప్పుడే దయామృతవార్ధి దిక్కగు ||నేమి||
3.
జాయా పుత్రోద్యాన గృహ వితా వితానములక – సకల వస్తుజాలము
ప్రతిష్ఠాను – భూతి విద్యలు – నిఖిల సంపదలు
నీ యవని లోపల సమర్పణ – జేయగ బడు గాని ఇంచుక – తోయమును కొని పోవ శక్యము – లేదు హా భ్రమ నొంద నేటికి ||నేమి||