#176One There is above all others
Author: జాన్ న్యూటన్ (అనువాదం: జె.హెచ్.)Translator: జె.హెచ్.)Category: క్రీస్తు జీవితము — ఉపదేశములు
1.
శ్రేష్ఠుడెల్లవారిలోను – మా యేసువే
తల్లికంటే ప్రియుడౌను – మా యేసువే
లోక స్నేహమస్థిరంబు నేడు ప్రేమరే పక్ష
స్థిరుడైన మిత్రుడౌను – మా యేసువే.
నాకు నిత్య జీవమౌను – మా యేసువే
సర్వమందు సర్వమౌను – మా యేసువే
నన్ను మేలుకొల్పి ప్రోచి శుద్ధిచేసి ప్రేమతో
నన్ను తన యందు జేర్చే – మా యేసువే.
ప్రేమమూర్తి సత్యవర్తి – మా యేసుве
ఇహపర భాగ్యమిచ్చు – మా యేసువే
క్రీస్తుకిమ్ము నీదు యాత్మ – నీకు శాంతినిచ్చి కాచి
తుది జేర్చు మోక్షమందు – మా యేసువే.
బాధనొందు మేము చేర – మా యేసువా!
మాకు హర్షమిచ్చినావు – మా యేసువా!
ఇహమందు నడిపించు – అవసానకాలమందు మోక్షసౌఖ్య మొందనిమ్ము – మా యేసువా!