FaithWalk
← Back to Library

#174యేసు మన ప్రియబంధువు

Author: పురుషోత్తము చౌదరిComposer/Ragam: అహిరిCategory: క్రీస్తు జీవితము — ఉపదేశములు
ప
యేసు వంటి ప్రియబంధుడూ నాకు ఇంక – నిహపరములలో లేడనల్లా భాసురముగ నిజ భక్తుల కిది యను – భవ గోచర మెప్పుడు నన్ను ||యేసు||
1.
ఊరు పేరు పరువులు మురువులు మరి – యూడ గొట్టబడినను గాని కూరిమితో క్రీస్తుడు మా కుండగ – కొదువ రాదు గొప్పయు పోదు ||యేసు||
2.
పాడికలు తిరస్కారంబులు మా – కవమానములున్నను గాని తోడు క్రీస్తుడు మా కుండినను త్రోవ – దప్పము ఓడిపోము ||యేసు||
3.
తగ్గుపాట్లును సిగ్గుపాట్లును – తలపై మెండుగ వాలినగాని దగ్గర మా పాలిట ప్రభువుండగ – సిగ్గును బొందము తగ్గున గొందము ||యేసు||
4.
ఎన్నెన్నో శోధన బాధలు చెల – రేగి మనలను జుట్టినప్పుడు కన్న తండ్రివలె నోదార్చుచు దన – ఘన వాగ్బలమున దనువును వానిని ||యేసు||
5.
మనసు క్రుంగి పలు చింతలచేత – మెట్టబడిన వేళను మాకు తన వాగ్దాతములను చేతుల లే – వెత్తి యెంతో సంతసమొసగును ||యేసు||
6.
తల్లిదండ్రులు విడిచిన గాని – తాను వదలడు ఎప్పుడు మమ్ము ఉల్లము నెత్తి పిలిచిన వేళ – నోహో యనుచు దరికి వచ్చు ||యేసు||
7.
అతడుండే పరమండలము ఇక – వెదకిన గాని అగపడదు క్షితి నాథుడు మా మతిని వసించిన – అతులిత సౌఖ్య మదియే మోక్షము ||యేసు||