FaithWalk
← Back to Library

#173యేసుని ప్రేమ స్మరణ

Author: దొరస్వామి ఆరోగ్యంComposer/Ragam: శంకరాభరణముCategory: క్రీస్తు జీవితము — ఉపదేశములు
ప
యేసుని ప్రేమను – నేమరకను – నెప్పుడు దలచవే యో మనసా వాసిగ నతని – వర నామంబును – వదలకు పొగడవే యో మనసా ||యేసుని||
1.
పాపుల కొరకై – ప్రాణము బెట్టిన – ప్రభునిల దలచవే యో మనసా శాపము నంతయు – చక్కగా నోర్చిన – శాంతుని పొగడవే యో మనసా ||యేసుని||
2.
కష్టములలో మన – కండగనుండిన – కర్తను దలచве యో మనసా నష్టములన్నియు – నణచిన యా గురు – శ్రేష్ఠుని పొగడవే యో మనసా ||యేసుని||
3.
మరణతరిని మన – శరణుగ నుండెడి – మాన్యుని దలచవే యో మనసా కరుణను మన కన్నీళ్ళను తుడిచిన – కర్తను పొగడవే యో మనసా ||యేసుని||
4.
ప్రార్థనలు విని – ఫలముల నొసగిన – ప్రభునిగ దలచవే యో మనసా వర్ధన గోరుచు – శ్రద్ధతో దిద్దిన – వంద్యుని పొగడవే యో మనసా ||యేసుని||
5.
వంచన లేక – వరముల నొసగిన – వరదుని దలచవే యో మనసా కొంచెము కాని – కూరిమితో దేవుని – కుమారుని పొగడవే యో మనసా ||యేసుని||