←అన్ని కీర్తనలు · All SongsHymn #171 of 763
Font size:
171
యేసూ నన్ను ప్రేమించినావు
Yaesoo Nannu Praeminchinaavu
యేసుని గొప్ప ప్రేమ
ముఖారి · త్రిపుట · బేతాళ జాన్
Mukhaari · Triputa · Bethala John
పల్లవి
యేసూ నన్ను ప్రేమించినావు – పాపినైన – నన్ను ప్రేమించినావు ||యేసూ||
చరణం 1
నన్ను ప్రేమింప మానవ రూపమెత్తితివా – నవయుగము జీవము సిలువపై నిచ్చి
కన్న తల్లిదండ్రుల – అన్నదమ్ముల ప్రేమ – కన్న మించిన ప్రేమతో ||యేసూ||
చరణం 2
తల్లి గర్భమున నే – ధరియింపబడినప్పుడే – దురితుండనై యుంటిని
నా వల్ల జేయబడెడు – నెల్ల కార్యము లెప్పుడు – హేయంబులై యుండగా ||యేసూ||
చరణం 3
మంచి నాలో బుట్ట – దంచు నీ వెరిగియున్నన్ – మించ ప్రేమింతి నావు
ఆహా యెంచ శక్యముగాని – మంచి నాలో బెంచ – నెంచి ప్రేమించినావు ||యేసూ||
చరణం 4
నన్ను ప్రేమింప నీ – కున్న కష్టము లన్ని – మున్నై తెలిసియుంటివి
తెలిసి నన్ను ప్రేమింప నీ – కున్న కారణ మేదో – యెన్న తెలియదు చిత్రము ||యేసూ||
చరణం 5
నా వంటి నరుడొక్కడు – నన్ను ప్రేమించిన – నావలన ఫలము గోరు
ఆహా నీవంటి పుణ్యునికి – నా వంటి పాపితో – కేవలం బేమి లేక ||యేసూ||