#170క్రీస్తుని దయ
Author: గొల్లపల్లి నథానియేలుComposer/Ragam: ముఖారిCategory: క్రీస్తు జీవితము — ఉపదేశములు
ప
యేసుక్రీస్తు ప్రభువా – మేము నీ – మోక్షమును బొందుటకు
దోషపు లోకము – లోనికి వచ్చితివి – దోషులను బ్రోచుటకు ||యేసు||
1.
పరిశుద్ధుడవు నీవు – ఇలలో – పాపుల నందరిని
పరిపరి విధ – కృప – వాక్కులతోడను – పిలిచితి వెల్లప్పుడు ||యేసు||
2.
సత్యపు నడతలతో – జగతిని – సర్వాద్భుతములను
నిత్యము చేయుచు – నీ కృప చాల – ఇలలో దెల్పితివే ||యేసు||
3.
అతి పుణ్యాత్ముడవే – క్షితిలో – వెతలను బొందితివే
మృతిని బొందియు – దురిత వితతి దూర – నమ్మిన – దురితుల స్నేహితుడా
నిరతము మమ్మును – నీ కృప లోపల – నిలకడగా బెంచుము ||యేసు||
4.
నోరు నిండ నెదలో – నీ కృప – ప్రేరణగలిగి
సారెకు వేడెద – ముక్తికి రక్షణ – కారకుడా నిన్ను ||యేసు||