FaithWalk
← Back to Library

#172యేసే మన సమస్తము

Author: గొల్లపల్లి నథానియేలుComposer/Ragam: నవరోజుCategory: క్రీస్తు జీవితము — ఉపదేశములు
ప
యేసుక్రీస్తు దొరికె నేని – యేమి కొదువ ఇంకేమి భయము దోషకారి జనుల కెంతో – గ్రాసమవునా యేసు పేరు ||యేసు||
1.
తల్లిదండ్రులకన్న చాలా ధన ప్రేమ మనమీద నెలకాలమునందునుంచు – యేసుడే మా తండ్రియౌను ||యేసు||
2.
వలనుగాని వశములేని – యెల్ల మేళ్ళన్నిటి నెల్లప్పుడు ము కలగా మన కిచ్చెడి దేవ – కుమారుడే వేరెవరూ లేరు ||యేసు||
3.
దండయైన గండములు – మెండుగాను మమ్ము జుట్టిన తండ్రివలె మా దరికి వచ్చి – గండములను గదిమి బ్రోచున్ ||యేసు||
4.
సత్యము మార్గము తానే – నిత్య జీవమింక తానే మృత్యువుల మనకీయ – మోక్షము – భువిని రక్తమంత గారె ||యేసు||
5.
ఎన్నరాని పాపాత్ముల – కన్నులార కనికరించి పుణ్యమైన తన ప్రాణము – భువిని బలిబెట్టినాడడు ||యేసు||
6.
ఒడలు నిండ గాయములతో – నడరుచుండ మరల లేచి వెడలి పరమందునుండి – వేడుకలు మాకు జూపినాడు ||యేసు||
7.
ఆశతోడ తనను నమ్ము – యాత్మలకు దర్శనమిచ్చెడి యేసుతో నింకెవరు సాటి – లేశమైనా లేరు సుండో ||యేసు||