FaithWalk
← Back to Library

#17దైవారాధన

Author: యేసుదాసు నరసయ్యComposer/Ragam: నాదనామక్రియCategory: దైవారాధన — దైవస్తుతి
ప
యెహోవా భజన చేయండి పాప నరులారా ఈ రీతి మరచి పోకండి ॥యెహోవా॥
1.
యేసు పేరిట ప్రార్థనంబు మన దోషములను బోగొట్టను వెరవు భాసుర పరలోక సుఖము కోటి బాధలు మనకున్న సంతోషకరము ॥యెహోవా॥
2.
యేసు క్రీస్తును గొలువండి యేసు దాసులతో వాదము లాడకండి మోసపు దారి విడువండి దోష రాసుల నుర్విలో జేసుకోకండి ॥యెహోవా॥
3.
జీవ రక్షకుని నమ్మండి నిత్య సేవలో మెలగక చెడిపోకండి భావించి యాత్మన్ వేడండి దేవ దేవుని నెడబాసి తెరువు విడవకండి ॥యెహోవా॥
4.
మాయ లోకపు భ్రాంతులు విడిచి మనుష్యాయువు భువిలోన జీలుట్ల దలచి మాయా మార్గము లెల్ల మరచి మోక్ష మార్గము మనమున మరవక తలచి ॥యెహోవా॥
5.
కాయము నొసగిన ప్రభుని యయిదు గాయంబు లాత్మలో గానంగ రాదా ఆయువు స్థిరమని తెలిసి మీరు కాయమాత్మయు నిప్పుడు కర్తకు నిచ్చి ॥యెహోవా॥