FaithWalk
← Back to Library

#16యెహోవా ప్రేమ (23వ దావీదు కీర్తన)

Author: పురుషోత్తము చౌదరిComposer/Ragam: శంకరాభరణముCategory: దైవారాధన — దైవస్తుతి
ప
యెహోవా నా మొర లాలించెను దన మహా దయను నన్ను గణించెను అహర్నిశల దీనహీనుడగు నా దుఃఖ సహాయుడెడు ధ్వని గ్రహించి మనిపెను ॥యెహోవా॥
1.
పిశాచి గడవిని బడ గొట్టెను దన వశాన నన్ను నిలువ బెట్టెను ప్రశాంత మధుర సువిశేష వాక్యముల నిశాంతమున జేర్చి సేద దేర్చెను ॥యెహోవా॥
2.
మదాలవము బోలు నా మదినన్ దన ప్రదీప్త వాక్యంబు హతిగా యథేచ్ఛలన్ని గుదించి పాపపు మొదలల్ తుదలల్ నరికి దరికి జేర్చెను ॥యెహోవా॥
3.
అహిత వస్త్రముల వదలించెను యేసు నాథు రక్తమున ముంచెను వినూత్న యత్నమెందైన నెన్నడు గనన్ వినన్ బ్రేమ నాకు జూపెను ॥యెహోవా॥
4.
విలాపములకు జవినిచ్చెను శ్రమ కలాపములకు సెలవిచ్చెను శిలానగము పై కిలాగి నన్ను సుఖ కళావలూల మనసులోన నిలిపెను ॥యెహోవా॥
5.
అగణ్య పాపియని ద్రోయక నన్ను గూర్చి తన సుతుని దా గారవించి మృతి కొప్పగించి పాపపు నెగుల్ దిగుల్ సొగసుగా నణంచెను ॥యెహోవా॥