FaithWalk
← Back to Library

#18క్రైస్తవారాధన

Author: పులిపాక జగన్నాథముComposer/Ragam: నటCategory: దైవారాధన — దైవస్తుతి
ప
కూడుకొని యున్నాము సంఘ ప్రభు కూడుకొని యున్నాము తోడుగా నుండెద ననుచు నమ్ముచు దొడ్డదగు నీ పాద సన్నిధి ॥కూడుకొని॥
1.
ఎచ్చట నా ప్రియ భక్తులు ఎలమి గూడియున్న నచ్చటికి నే తెంతునని పల్కితి విచ్చటనుండు మమ్ము వీక్షించి కృపచేత నిప్పుడు దీవించుమీ యేసు క్రీస్తునాథా ॥కూడుకొని॥
2.
గత కాలమందున గాని చేతలచే దుర్గతి నొంది యుండగా గనుగొంటివి శత సంఖ్య గల పాప యాత్మ స్వరూపా ॥కూడుకొని॥
3.
నిరతము నీ ప్రేమ నెనరున ధ్యానించి పరమ ధర్మములందు బ్రవర్తన గలిగి యన్యులకు శుభములు నిరంతరంబు చేయగ దిరత మా కొసగుము దేవుని ప్రియ తనయా ॥కూడుకొని॥
4.
అన్ని శోధనముల అన్ని విపత్తుల అన్ని కాలములందు నాదరించి నిన్ను నమ్మిన జనుల నీ సంకిటను జేర్చి పన్నుగ గాపాడు ప్రభు యేసు క్రీస్తు ॥కూడుకొని॥
5.
అమలుండ నగు నన్ను ననుసరించు చుండునని నాజ్ఞ యిచ్చినట్టి వాత్మజులకు నమల మార్గమునందు నరుగంగ మాకవు విమలాత్మ దయచేయు వేగంబు మా తండ్రి ॥కూడుకొని॥