FaithWalk
← Back to Library

#159ద్రాక్షావల్లి, తీగెలు

Author: ఎం.జె. రామానుజములుComposer/Ragam: శంకరాభరణము (ఛాయ: సర్వ దేశములారా)Category: క్రీస్తు జీవితము — ఉపదేశములు
ప
ద్రాక్షావల్లిని నేను – ద్రాక్షాతీగెలు మీరు అక్షయు డేసటు పలికె అతిముదమునను వినరండి ||ద్రాక్షా||
1.
నాయందుండని తీగె – నాశనమొందును నిజము నాశనమొందక మీరు – నాయందుండుడు ఫలింపన్ ||ద్రాక్షా||
2.
ఫలముల నివ్వని తీగె – పనికిరాదని నరికి పారవేయబడును – నిరతము తథ్యము నిప్పులలో ||ద్రాక్షా||
3.
ఫలించు ప్రతి తీగె – ఫలముల పెక్కుగా నివ్వన్ పరిశుద్ధి చేయబడున్ – యెరుగుడి మీరది అనవరతం ||ద్రాక్షా||
4.
నాయందుండని గాని – నయమగు కాపుండదటన్ నాయందుండినవాడు – నాణ్యపు ఫలములనిచ్చు నాహా ||ద్రాక్షా||
5.
మీరు ఏదియు చేయ – లేరు నాకు వేరై వేరుగ మీరుండినచో – వెంటనే యెండిపోయెదరు ||ద్రాక్షా||
6.
కాన యేసుని యందు – మానకనుందుము సేవ మాన్య యేసుని పలుకులు – మది దలచెదమిల మరువకను ||ద్రాక్షా||