#158ఇదిగో నీ రాజు నీ యొద్దకు వచ్చుచున్నాడు
Author: UnknownComposer/Ragam: యమునా కల్యాణి (ఛాయ: కలుగును గాక)Category: క్రీస్తు జీవితము — ఉపదేశములు
ప
సీయోను కన్యా – సంభ్రమపడుచు – వేయుము కేకల్
పాయక నీ రాజు – భారవాహక మెక్కి
బాలస్తోత్రములతో – బైలుదేరి వచ్చె ||సీయోను||
1.
హెబ్రా భాషలోను – నీ రాజు పేరు – యూదుల రాజు
హెబ్రీ జనులను – అబ్రాము కొడుకులను – విభవ దేశము జేర్చు – శుభరాజు యీతండే ||సీయోను||
2.
హెల్లేనీలోను – నీ రాజు పేరు – యూదుల రాజు
యెల్ల పాపుల బ్రోచు – తాల్మి రక్షకుడితడు – చల్లని ప్రభువని – గొల్గొతా మ్రోగెను ||సీయోను||
3.
ఉర్వి రోమాలో – నీ రాజు పేరు – యూదుల రాజు
సర్వ రాష్ట్రములకు – పూర్వ పితరులతోను – వర సింహాసన మిచ్చు – వరదేశాధిపతి యీతడు ||సీయోను||
4.
వాసిగ హెబ్రీ – హెల్లేనీ రోమాయులోను
హోసన్నా హోసన్నా – ప్రభుని పేరట వచ్చు
మెస్సయ్య దావీదు – కొడుకా శ్రీ శుభములు ||సీయోను||