FaithWalk
← Back to Library

#160క్రీస్తును గూర్చి ప్రవచనములు

Author: పురుషోత్తము చౌదరిComposer/Ragam: పంతువరాళి (ఛాయ: ఇడుగో గొర్రెల కాపరి)Category: క్రీస్తు జీవితము — ఉపదేశములు
1.
అల పిశాచముతోడను – దేవుడు తొల్లి – పలుకు వాక్యము జాడను పొలతి సంతతి నిన్ను – తల గొట్ట పుట్టునని – తెలియజేసెను మోషే – దీర్ఘదర్శన వాక్యము ||ఇదిగో||
2.
ఘన దివ్య బలిచేయను – పాపములెల్ల – దులిపి పుణ్యము లీయను ఒనరగా నీ కాలమున – క్రీస్తు వచ్చునని – మును దానియేలు బల్కె – దీర్ఘదర్శనము ||ఇదిగో||
3.
యూద రాజ్యము లోపల – బేత్లెహేమనెడి – యూర క్రీస్తుడు పుట్టుట ఆదిలోన మీకా – యను దీర్ఘదర్శిచే – మోదమున దెల్పబడె – ముందు వేదమునందు ||ఇదిగో||
4.
మన దోషముల కొరకునై – యేసుని కాయము – మది గాయముల హ్రస్వమై మన రక్షకుని పాట్లు – గనినట్లు యెషయా – మును దెల్పె దీర్ఘదర్శన – వాక్యములు ఇచ్చి ||ఇదిగో||