FaithWalk
← Back to Library

#156క్రీస్తు తుఫానును నిమ్మళపరచుట

Author: తూసిలి బెంజిమిన్Composer/Ragam: ముఖారిCategory: క్రీస్తు జీవితము — ఉపదేశములు
ప
ఏలాటివాడో కాని – ఈ యేసుని – నేమని వివరింతుము గాలివాన యేసుని – గద్దింపునకు చాల భయపడి నిలిచెను ||ఏలాటి||
1.
ముద్దు శిష్యులతోడను – సముద్రపు – అద్దరికి వెళ్ళనూ కొద్ది పడవ నెక్కెను – ఇంతలోనే – పెద్దగాలి రేగెను ||ఏలాటి||
2.
అల్లకల్లోలముగా – సముద్రము – అల్లలాడునప్పుడు చల్లగ దోనె వెనుక – తలగడపైన – మెలల్ల నిద్రవోయెను ||ఏలాటి||
3.
చింత లేదా యేమయ్యా – బోధకుడా – నశించిపోవుచున్నాము ఎంతో వేదన పడితిమి – కాపాడుమా – అంచు శిష్యులు లేపిరి ||ఏలాటి||
4.
దిగ్గున ప్రభువు లేచి – యా గాలిని – గద్దించిన వెంటనే తగ్గి నిమ్మళించెను – సమస్తము – సద్దులడగి పోయెను ||ఏలాటి||
5.
ఏల భీతులైతిరి – ఇంతలోనే – యెంత నమ్మిక లేదని ఈలాగు నోదార్చెను – యేసు తన – సొంత శిష్యుల నప్పుడు ||ఏలాటి||