#157వ్యాధి బాధిత రాలిని స్వస్థపరచుట
Author: తూసిలి బెంజిమిన్Composer/Ragam: ఆనందభైరవి (ఛాయ: దేవుని ప్రేమ ఇదిగో)Category: క్రీస్తు జీవితము — ఉపదేశములు
ప
యేసు వస్త్రపు చెంగును – మాత్రము – యాశించి ముట్టినట్టి
దోషకారుల రోగముల్ – వెంటనే – తొలగి పోయెను నిజముగ ||యేసు||
1.
గుంపు గూడిన జనులతో – ప్రభు యేసు – సొంపుతో బోవునప్పుడు
తెంపుతో రమణి యొక్కతె – ప్రభు చెంగు – తెలియకుండను ముట్టెను ||యేసు||
2.
అంతటను రక్తధార – యామెకు – కింతైన లేకపోయె
ఇంతలో ప్రభువు యెరిగి – తన యొక్క – వింత జూపెను జనులకు ||యేసు||
3.
ప్రజలారా మీలో నొకరి కన్ – నాదు ప్ర – భావంబు స్వస్థపరచే
నిజమంచు ప్రభువు చెప్ప – వణుకుతో – గజయాన వచ్చి నిల్చే ||యేసు||
4.
ఒదుగుచుండిన వనితతో – శ్రీ యేసు – అదురు మానుమి యింకను
ఇదిగో నీ విశ్వాసము – రక్షించె – ముదిత నెమ్మదిని వెళ్ళు ||యేసు||
5.
ఏపుమీరగా యేసును – మీ యొక్క – ప్రాపుగా నమ్ముకొనుడి
ఆపదలు దొలగించును – నిజముగ – పాపము బాపును ||యేసు||