#151పుట్టు గ్రుడ్డికి చూపునిచ్చుట
Author: పురుషోత్తము చౌదరిComposer/Ragam: నవరోజుCategory: క్రీస్తు జీవితము — ఉపదేశములు
ప
అందమైన క్రీస్తు కథ మీ – రాలింపరయ్య ||అందమైన||
1.
పొందుగ శిష్యులతో యేసు – పోవుచుండు మార్గమందు – ముందుగా
వీక్షించి రొక్క పుట్టు గ్రుడ్డివాని – అందు గొందరు శిష్యు లాత్మలో భావించి – రెండు కేతనుడు చీకటయ్యెను దీని విధమేమో – డెందములను గల్గు సందియములు వీడ – విందమనుచు లోక వంద్యుని సంతతానందుని మనుజ నందనుని నడిగిరప్ప ||అందమైన||
2.
చీకువాడై జన్మించుటకు – జేసెనా దుష్కృతము నితడు – లేక వీని జననీ జనకు లేమి చేసిరో – యీ కారణము దెల్ప మోక్షకర్త ఇపుడవు – మాకంచు తను వేడ – లోకేశ్వరుండు నిరాకారుడితని యందు – దీకార్యములు జూప ప్రాకటముగ జేసె – గాక వేరొక విధము లేకున్నదని తెలిపి – చీకు బ్రోవ దలంచె ||అందమైన||
3.
బురద వాని కన్నులందు – గర్వములతో జమిలి యొక్క చేరువులో
ప్రక్షాళించుటకు సెలవిచ్చె ప్రభువు – బిరబిర నయ్యంధు డరిగి యేసుని పలుకు – దిరముగ మదినమ్మి సరసిలో మునిగి సుందరమైన నేత్రముల్ – ధరియించి యానంద భరితుడై చనుదెంచె – తరి వాని పొరుగింటి నరులబురముగ జూచి – విస్మయమగు వాని ||అందమైన||
4.
చూపులేని గ్రుడ్డివాని – జూడగలుగువాడే పాపాంధకార
మగ్నుల నా ప్రభువే రక్షించు – పైపైన మన కన్ను చూపు చూపుది కాదు – లోపలి కన్ను గ్రుడ్డియై పోయి యున్నది – యాప తత్పరంపర లో బొరలుచున్నాము – కాపాడుమని యేసు శ్రీ పాదములు పట్టి – చూపు లోపలి చూపు జూసి యానందింతుము ||అందమైన||