#150లాజరును తిరిగి బ్రతికించుట
Author: పురుషోత్తము చౌదరిComposer/Ragam: శంకరాభరణముCategory: క్రీస్తు జీవితము — ఉపదేశములు
ప
వినరే మనుజులారా క్రీస్తు – జడలను జేయు ఘనములైన
పనులలోన జిత్రమొక్క – పని వచించెద ||వినరే||
1.
మన మనంబు లలరుచుండ – దినదినంబు ప్రభుని నిండు
ఘన మహాద్భుతములు వినిన – దనివి దీరదు ||వినరే||
2.
ఇలను బేతనియాపురంబు – గలదు మరియ మార్త లక్క
చెలियలందు వాసముండి – రెలమితోడను ||వినరే||
3.
పరిమళంపు తైలమేసు – చరణములకు పూసినట్టి
మరియ సోదరుండు రోగ – భరితుడయ్యెను ||వినరే||
4.
వ్యాధిచేత లాజరుండు – బాధనొందుచుండ గ్రీస్తు
నాధు బిలువనంప రపుడు – నాతులు ఇరువురు ||వినరే||
5.
తమ్ముడొక్క చెలియలను బ్రా – యమ్ము తనకు గలిగియుండ
నమ్మహాత్ముడైన క్రీస్తు – నడిగె నచటికి ||వినరే||
6.
యేసు వచ్చుటెరిగి మార్త – యెదురుగాను బోయి తనదు
దోసిలొగ్గి మ్రొక్కి ప్రభువు – తోడ బల్కెను ||వినరే||
7.
కర్త నీకు దేవుడిచ్చు – ఘనబలమెరుగుదును సత్య
వర్తి విచట లేని కతన – బ్రాణమొందె లాజరు ||వినరే||
8.
పదిలపడి మరియ వచ్చి క్రీస్తు – పదయుగమున గొరిగి యేడ్వ
మొదట మార్త పలికినట్లు – సుదతి పలికెను ||వినరే||
9.
అపుడు కర్త వారి పలుకు – లాలకించి మదిని మూల్గి
కృపకు బాత్రురాలితోడ – నపుడు నడిచెను ||వినరే||
10.
నడిచి లాజరుని సమాధి – కడకు జేరి గుహను మూయ
బడిన రాయి తీయుడనుచు – ప్రభువు చెప్పెను ||వినరే||
11.
యేసుతోడ మార్త పలికె – నీ సమాధినుండి నాలు
గు వాసరంబులయ్యె గంపు – పట్టి యుండదా ||వినరే||
12.
దాని నమ్మి చూడమని మహానుభావు – డాత్మబలము నూని
తండ్రికపుడు స్తోత్రమొనర – జేసెను ||వినరే||
13.
లాజరూ సమాధి వెడలి – రమ్ము పొమ్మటంచు లోక
పూజితుండు మహా రవమున – బాసి పల్కెను ||వినరే||
14.
మరణమైనవాడు ప్రాణ – భరితుడగుచు లేచి వచ్చె
తరుణులధిక హర్షులైరి – పెద్ద జనముతో ||వినరే||
15.
కన వినంగరాని యిట్టి – ఘన మహాద్భుతంబు గాంచి
జనులు క్రీస్తు యేసు నాధు – ననుసరించిరి ||వినరే||
16.
కనుక మనము వాని జేర – కొని సుఖంబు బడయవచ్చు
మనసు నిలిపి యతనియందు – మనుట మేలగున్ ||వినరే||