#149క్రీస్తునందు ప్రత్యక్షమైన దేవుని ప్రేమ
Author: గొల్లపల్లి నథానియేలుComposer/Ragam: ఆనందభైరవిCategory: క్రీస్తు జీవితము — ఉపదేశములు
ప
దేవుని ప్రేమ ఇదిగో – జనులారా – భావంబునందు తెలియరే
కేవలము నమ్ముకొనిన – పరలోక – జీవంబు మన కబ్బునూ ||దేవుని||
1.
సర్వ లోకము మనలను – తన వాక్య – సత్యంబుతో జేసెను
సర్వోపకారుడుండ – మన మీధ – జాలిపరుడై యుండెను ||దేవుని||
2.
మానవుల రక్షింపను – దేవుండు – తన కుమారుని బంపెను
మన శరీరము దాల్చెను – ఆ ప్రభువు – మన పాపమునకు దూరుడే ||దేవుని||
3.
యేసుక్రీస్తను పేరున – రక్షకుండు – వెలసినాడిలలోపల
దోషకారి జనులతో – నెంతోను – భాషలను పలికినాడు ||దేవుని||
4.
పాప భారంబుతోడ – నే ప్రొద్దు – ప్రయాసముల బొందెడి
పాపులందరూ నమ్మిన – విశ్రాంతి – పరిపూర్ణమిత్తు ననెను ||దేవుని||
5.
సతులైన పురుషులైనను – యా కర్త సర్వ – జనుల యెడలను
సత్ప్రేమగ నడిచెను – పరలోక సద్బోధలక జేసెను ||దేవుని||
6.
చావు నొందిన కొందరిని – యేసుండు – చక్కగా బ్రతికించెను
సకల వ్యాధుల రోగులు – ప్రభునంటి – స్వస్థంబు తా మొందిరి ||దేవుని||
7.
గాలి సంద్రపు పొంగులన్ – సద్దణచి – నీళ్ళపైన నడిచినాడు
మేలు గల యద్భుతములు – ఈలాగు – వేలకొలదిగ జేసెను ||దేవుని||
8.
చేతుల కాళ్ళలోను – రార రాజు – చేర మేకులు బొందెను
పాతకులు గొట్టినా రే – పరిశుద్ధ – నీతి తా మోర్వలేకన్ ||దేవుని||
9.
ఒడలు రక్తము గారగ – దెబ్బలు – చెడుగులందరూ గొట్టిరి
వడి ముళ్ళు తలమీదను – బెట్టిరి ఓర్చెనో రక్షకుండు ||దేవుని||
10.
ఇన్ని బాధలు బెట్టుచు – దను జంపు – చున్న పాప నరులను
మన్నించు మని తండ్రిని – యేసుండు – సన్నుతితో వేడెను ||దేవుని||
11.
రక్షకుడు శ్రమ బొందగా – దేశంబు – తక్షణము చీకటయ్యెను
రక్షకుడు మృతి నొందగా – తెర చినిగి – రాతి కొండలు పగిలెను ||దేవుని||
12.
రాతి సమాధిలోను – రక్షకుని – నీతిగల దేహంబును
పాతి పెట్టిరి భక్తులు – నమ్మిన – నాతులందరూ జూడగా ||దేవుని||
13.
మూడవ దినమందున – యేసుండు – మృతి గెల్చి లేచినాడడు
నాడు నమ్మిన మనుజులు – చూచిరి – నలువది దినములందున ||దేవుని||
14.
పదునొకండు మారులు – వారలకు – ప్రత్యక్షమాయె నేసు
పరలోకమునకు కేగెను – తన వార్త – బ్రకటించమని పల్కెను ||దేవుని||
15.
నమ్మి బాప్తిస్మమొందు – నరులకు – రక్షణము మరి కలుగును
నమ్మనొల్లక పోయెడు – నరులకు – నరకంబు సిద్ధమనెను ||దేవుని||