#152యేసుక్రీస్తు ప్రత్యక్షత
Author: తూలూరు ప్రకాశముComposer/Ragam: నాదనాయకప్రియ (ఛায়: యెహోవా భజన చేయండి)Category: క్రీస్తు జీవితము — ఉపదేశములు
ప
కనరే యేసుని ప్రత్యక్షంబు – అన్య – జనులకు గలిగిన విధమెట్లో తరచి ||కనరే||
1.
నక్షత్ర మార్గాన జ్ఞానుల్ – బోయి – రక్షకుని జూచి రక్తిమీరంగ
కాంక్షతో ప్రభునికి మ్రొక్కి కాన్కల్ – కాంతిమీరగ నిచ్చి తరలి పరగన్ ||కనరే||
2.
పదియు రెండేండ్ల ప్రాయమున – ప్రభువు – పస్కాపండుగనకు బరగబోయెనుగ
ముదముప్పె దేవాలయములో – జేరి – ముద్దుగ బోధించె బోధకులకును ||కనరే||
3.
కానావూరి పెండ్లికరిగి – ప్రభువు – ఘనముగ నీళ్ళు ద్రాక్షారసముగ జేసెన్
తన వర మహిమను బయలుపరచి – శిష్యుల – మనముల బలపరిచె ఘన విశ్వాసమున ||కనరే||
4.
కుష్ఠరోగి యొక్కడు వచ్చి – తనదు – కుష్ఠరోగము బాప ప్రభుని వేడంగ
ఇష్టమతితో ప్రభువు వాని – ముట్టి కుష్ఠరోగము బాపె కోర్కెలూరంగ ||కనరే||
5.
శతాధిపతి విశ్వాసమును – ప్రభువు – తరచి చూచి మెచ్చి దయ జూపి కనరే
హితముగ వాని దాసుని పక్ష – వాతంబు స్వస్థత మరి గావించెనుగ ||కనరే||
6.
గాలివానల విప్లవంబు – ప్రభువు – గద్దించి సద్దణచి ఘన మహిమ జూపె
గాలి సంద్రముపైన హక్కు – ప్రభునికి గలదంచు శిష్యులు ఘనపరచిరిగ ||కనరే||
7.
ఇట్టి శక్తిగల ప్రభుని – మనము – గట్టిగ నమ్మిన కలుగు రక్షణము
పట్టు వీడక ప్రభుని నెప్పుడు – గొల్చి – పరమ శాంతిని బొంది మరి వెలుగగలము ||కనరే||