FaithWalk
← Back to Library

#15యెహోవా నా కాపరి (23వ దావీదు కీర్తన)

Author: సరెళ్ల సమూయేలు సుబ్బయ్యComposer/Ragam: శంకరాభరణము (ఛాయ: ఎంత ప్రేమ)Category: దైవారాధన — దైవస్తుతి
ప
యెహోవా నా కాపరి లేమేమి కలుగుదు తన మహా కృపతో బ్రోచి నన్ను మనుపు నాతడే ॥యెహోవా॥
1.
పచ్చిక గల చోట్ల నన్ను పరుండజేయుచు గడు హెచ్చుగ సౌఖ్యములు సదా ఇచ్చు నాతడే ॥యెహోవా॥
2.
శాంతికర జలములకు నన్ను సాగజేయుచు విశ్రాంతి ప్రాణమున కొసంగు విభుడు ఆతడే ॥యెహోవా॥
3.
గాఢాంధకారమైన లోయల గుండ బోయిన నే కీడుకు భయపడ నిక నాతోడు ఆయనె ॥యెహోవా॥
4.
దుడ్డుకర్రతో శత్రువులన్ దరుమ గొట్టుచు దన దొడ్డ దండముతో నీతి దారిలో నడుపు ॥యెహోవా॥
5.
అందరిలో నన్ను నెంచి యధిక ప్రేమతో గడు విందొసగి తృప్తిపరచు విభుడు ఆయనె ॥యెహోవా॥
6.
ముఖము కళగా నుండునట్లు మంచి తైలమున్ నా సఖుడు నాకు బూయుచుండు సకల వేళలన్ ॥యెహోవా॥
7.
బ్రతుకు దినములన్నిట నాకు బంటులవలెనే నన్ను వెదకి కృపా క్షేమములు నా వెంటవచ్చును ॥యెహోవా॥