FaithWalk
← Back to Library

#14యెహోవా నా కాపరి (23వ దావీదు కీర్తన)

Author: ముంగమూరి దేవదాసుComposer/Ragam: సావేరిCategory: దైవారాధన — దైవస్తుతి
ప
నాకేమి కొదువ నాధుడుండగ నిక నభీకరుండగు దేవుడే నా శ్రేష్ఠ పాలకుడు నా యేక రక్షకుడు గనుక ॥నాకేమి॥
1.
తనివి దీర మేత మేపను నన్ను సదా మేల్కొనెడి పచ్చిక నదిమి మృదువుగా బండుకొనజేయును గనుక ॥నాకేమి॥
2.
ఎంత శోధన యెండ యున్న నాకు నెంతకు నోరిగదెప్పుడు శాంత జలములు నా చెంతనే యుండును గనుక ॥నాకేమి॥
3.
తప్పి పోయిన నన్ను దారిం బెట్టి నన్ను దప్పరిల్ల జేసి నాకు దీరు నలసటను నా తప్పులు మన్నించు గనుక ॥నాకేమి॥
4.
నీతి మార్గమునన్ నిల్పు నన్ను ప్రభువు నీతి లేని నాకున్ దనను నీతి దయచేయున్ స్వనీతిని ద్రుంచున్ గనుక ॥నాకేమి॥
5.
చావు చీకట్ల శక్తి యుండు ఆహా లోయ లోబడవలసినను నే వెరవకుందు నా దేవుడే తోడు గనుక ॥నాకేమి॥
6.
మీద పడునట్టి శోధనలన్ ధరణిను నా దరికి రానీక దండము నన్ను బ్రోచుచు నా కాధరణి యౌను గనుక ॥నాకేమి॥
7.
పగవారల్ సిగ్గు పడునటుగా నా జగము యెరుగని సౌఖ్య భోజన మగపరుచును హా తగినదే పెట్టున్ గనుక ॥నాకేమి॥
8.
తన యాత్మానంద తైలంబుతో ప్రభువు నన్ను దినము తల యంటి విసుగు కొనక తుడుచును నా కన్నీళ్లన్నీ గనుక ॥నాకేమి॥
9.
పలువిధములైన భాగ్యములతో తండ్రి వెలుపలికి దిగవడలునట్టి వెలగల గిన్నె నా కలిమిగా జేయున్ గనుక ॥నాకేమి॥
10.
బ్రతుకంతయు గృహ క్షేమములు నా వదలకుండ వచ్చు నాతో సుదినములు గల నా పదలు సంపద లౌను గనుక ॥నాకేమి॥
11.
దురితంబు లుండు ధరణి నాకు నిజము నిరవుగా దింక నెప్పటికి నా పరమ దేవుని మందిరమే నా యిల్లు గనుక ॥నాకేమి॥