FaithWalk
← Back to Library

#13నీవే నా సహాయుడవు

Author: పులిపాక జగన్నాథముComposer/Ragam: శంకరాభరణము (ఛాయ: మన మొదటి తల్లిదండ్రులు)Category: దైవారాధన — దైవస్తుతి
ప
నా కాలగతులు ఇవ్వి నా చేతులను లేవు నాదు దేవ యెప్పుడు నీకే వాని మీద నిత్యాధికారంబు నిలిచియుండు ॥నా॥
1.
తల్లిగర్భంబున దస్ర సృజించితివి ధరణి నన్ను నీవు తల్లికన్నను మిగుల దయచేత నేలితివి తండ్రి నన్ను ॥నా॥
2.
పాప కూపంబునందు పడియుండగా నన్ను బార జూచి చేయి చాపి యేసుద్వార చక్కగా దెచ్చితివి చాలు దేవ ॥నా॥
3.
సుఖదుఃఖ కాలములు శోధించి పంపుదువు శోభాయుక్త నాకు సుఖము గలగజేయు సొంపుగ వానిచే స్థూల శక్తి ॥నా॥
4.
సకల కాలంబుల చక్కగ లోబడి నిన్ను నుతింతు నన్ను ఆకలంకు నిగా జేయు మనుచు వేడుచునుందు నధికాసక్తి ॥నా॥