#148Take the Name of Jesus with you
Author: ఎల్. బాక్స్టర్ (అనువాదం: జాన్ అబెరిల్)Translator: జాన్ అబెరిల్)Category: క్రీస్తు నామములు — బిరుదులు
ప
శ్రేష్ఠమౌ నామము – ఆదరించు నిలను
శ్రేష్ఠమౌ నామము – మోక్షసౌఖ్య మదియే ||
1.
యేసు నామము స్మరించు – బాధ నీకు గల్గు
గానది క్షేమ సౌఖ్య మిచ్చు దాని స్మరియించుము.
యేసు నామము స్మరించు శోధనంబులుండగా
డాలుగాను దాని నెంచి – వేడుమా సునామమున్.
మమ్ము జేర్చనీయు యేసు నామము స్తుతింపగా
మాధుర్యంపు నామ మౌను – ఆత్మ కిద్ది తుష్టియే.
మ్రొక్కుచుందు మేసు నాథ నీదు పాద పద్మముల్
మోక్షమందు జేరగాను – హెచ్చుగా నుతింతుము.