#147How Sweet the Name of Jesus Sounds
Author: జాన్ న్యూటన్Category: క్రీస్తు నామములు — బిరుదులు
1.
నా యేసు నామ శబ్దము – ఎంతో ఇంపైనది
భయాదులెల్ల దీర్చి విశ్రాంతి నిచ్చును.
ఆకలిగొన్న యాత్మకు – అదే మన్నాయగు
ప్రయాసపడ్డవారికి – ఫలము నిచ్చును.
ఈ ప్రియమైన నామము – నిరీక్షణించును
నా దుర్గమైన స్థానము – కృపానిలయము.
నా యేసు దివ్య నామము – సుక్షేమ నిధియౌ
నా దిక్కులేని యాత్మకు సమృద్ధినిచ్చును.
యేసూ నీవే నా కాపరి – నా రక్షకా,
రాజా, నా ప్రభువా, నా జీవమా! నా స్తుతి పొందుము.
నీ ప్రేమ ప్రకటించుదును నా చావు వరకు
నీ నామ సంకీర్తనము – నన్నాదరించును.