FaithWalk
← Back to Library

#144యేసే సర్వాధిపతి

Author: రావూరి రత్నముCategory: క్రీస్తు నామములు — బిరుదులు
ప
క్రీస్తే సర్వాధికారి – క్రీస్తే మోక్షాధికారి క్రీస్తే మహోపకారి – క్రీస్తే ఆ సిలువధారి ||
1.
ముక్తి విధాత నేత – శక్తి నొసంగు దాత భక్తి విలాప శ్రోత – పరమంబు వీడె గాన ||క్రీస్తే||
2.
దివ్య పథంబు రోసి – దైవంబు తోడు బాసి దాసుని రూపు దాల్చి – ధరణికే తెంచె గాన ||క్రీస్తే||
3.
శాశ్వత లోకవాసి – సత్యామృతం పురాశి శాప భారంబు మోసి – శ్రమల సహించె గాన ||క్రీస్తే||
4.
సైతాను జనుల గాల్పన్ – పాతాళమునకు బంపన్ నీతి పథంబు బెంప – రుధిరంబు గారె గాన ||క్రీస్తే||
5.
మృత్యువు ముల్లు త్రుంపన్ – నిత్య జీవంబు బెంపన్ మర్యాద భీతి దీర్పన్ – మరణంబు గెలిచె గాన ||క్రీస్తే||
6.
పరమందు విబుధులైన – ధరయందు మనుజులైన ప్రతి నాలుక మోకాలు – ప్రభునే భజించు గాన ||క్రీస్తే||
7.
ఈ నామమునకు మించు – నామంబు లేదటంచు యెహోవా తండ్రి యేసున్ – హెచ్చించినాడు గాన ||క్రీస్తే||