FaithWalk
← Back to Library

#143రారtext యేసు

Author: పి. రవివర్మComposer/Ragam: బేహాగ్Category: క్రీస్తు నామములు — బిరుదులు
ప
రారాజగు యేసు నీ నామం – వర్యంబగు దేవుని నామం ఈశుండగు యేసు నీ నామం – ఈ ధర నిధే పావన నామం యేసు నీ నామం – దేవుని నామం – వర్యంబగు దేవుని నామం ||రారాజ||
1.
గగనము వీడిన గురు నామం – కలుషాత్మల బ్రోచెడు నామం ||రారాజ||
2.
స్వాంగకముగల యీ నామం – సుజనుల జేసెడు స్థిర నామం ||రారాజ||
3.
విజయము నొప్పెడు నిజ నామం – విమలాత్మల కిది వర నామం ||రారాజ||
4.
మనమున కిది యజ్వల నామం – జనుల కిది యే బుజు నామం ||రారాజ||
5.
ఈ ధర సుతులను కొను నామం – ఈ యేసుని యమృత నామం ||రారాజ||