#145యేసే మార్గము
Author: ముంగమూరు దేవదాసుComposer/Ragam: మోహనCategory: క్రీస్తు నామములు — బిరుదులు
ప
నీవే యని నమ్మిక – యేసు నాకు – నీве యని నమ్మిక
నీవే మార్గంబు – నీవే సత్యంబు – నీవే జీవంబు – నీవే సర్వంబు ||నీవే||
1.
పెడదారిన బోవగ – నా మీదికి – ఇడుములు ఎన్నియో రాగ
అడవిలో పడి నేను – ఆడుకొనుచునుండగ – తడవకుండ దొరుకు – ధన్యమౌ మార్గంబు ||నీవే||
2.
కారుమేఘము పట్టగ – నా మనస్సులో – కటిక చీకటి పుట్టగ
ఘోరాపదలు చేరి – దారియని భ్రమపడగ – తేరి చూడగల్గు – తేజోమయ మార్గంబు ||నీవే||
3.
లేనిపోని మార్గంబు – లెన్నో యుండ – జ్ఞానోపదేశంబు
మానుగ జేయుచు – వానిని ఖండించి – నేనే మార్గమన్న – నిజమైన మార్గంబు ||నీве||
4.
నరలోకమునుండి పరలోకంబు – వరకు నిచ్చెనగా నుండి
నరులకు ముందుగా – నడచుచు ముక్తికి – సరిగా కొనిపోవు సు – స్థిరమైన మార్గంబు ||నీవే||