←అన్ని కీర్తనలు · All SongsHymn #141 of 763
Font size:
141
వరనామమే శరణము
Varanaamamae Sharanamu
క్రీస్తు నామమే మన శరణము
శ్రీరాగము · అట · విలియం డాసన్
Shreeraagamu · Ata · William Dawson
పల్లవి
వర నామమే – శరణము శరణము – క్రీస్తు – వర నామమే – శరణము శరణం ||వర||
చరణం 1
పరమ భక్త వ్రాత – దురిత సంఘాత
దుస్తర వన జాత భీ – కర కర హేలియౌ క్రీస్తు ||వర||
చరణం 2
సారహీన సం – సార పారావార
తారణ కారణ – తరణియైన క్రీస్తు ||వర||
చరణం 3
యూద దేశమునందు – నుండు బేత్లెహేమున
యూదులను జనులలో – పాదుకొన్న క్రీస్తు ||వర||
చరణం 4
ఇలలో పాపపు మాన – వులనెల్ల మోక్ష
కలితులను జేయగ – సిలువ నొందిన క్రీస్తు ||వర||
చరణం 5
విసిగియున్నట్టి పి – శాచి భారపు కాడి
మోసి దుఃఖించెడు – నీచులకును క్రీస్తు ||వర||
చరణం 6
కొల్లగాను బాప – మెల జేసి దాని
కులములలో దల్ల – డిల్లు వారికి క్రీస్తు ||వర||