#140యేసునామ మాధుర్యము
Author: యోసేపు దానియేలుComposer/Ragam: కాంభోజిCategory: క్రీస్తు నామములు — బిరుదులు
ప
యేసూ నీ నామామృతము మా – కెంతో రుచి యయ్యో – దేవ
మా దోషములను హరించి మోక్షాని – వాసులుగ జేయుటకు భాసుర ప్రకాశమైన ||యేసు||
1.
వేడుకల రంగ గూడి నిను గొని – యాడెడు వారికి – దేవ
యెంతో కీడు చేసిన పాడు వైరిని – గోడుగోడనంగ వాని తాడనము జేసితివి ||యేసు||
2.
పాపములు హరింప నీవే – ప్రాపు మాకయ్యో – దేవ
నీ దాపున జేరిన వారి కందరి – కాపదలు బాపి నిత్య కాపుగతి జూపినావు ||యేసు||
3.
అక్షయ కరుణేక్ష భువన – రక్షకా నీవే – దేవ
మమ్ము పక్షముగ రక్షించి మోక్షసు – రక్షణకు దీక్ష గొని వీక్షితులమైన మాకు ||యేసు||
4.
అందమగు నీ మందిరమున – బొందుగా మేము – దేవ
నీ సుందర కరుణామృతము మా – డెందముల యందు గ్రోలుటకు సుందరమైన ||యేసు||