FaithWalk
← Back to Library

#138యేసు నామము పావనము

Author: పురుషోత్తము చౌదరిComposer/Ragam: ఆనందభైరవిCategory: క్రీస్తు నామములు — బిరుదులు
ప
యేసు నామమే పావనము – మాకు – యేసుగద నిత్య జీవనము దాస జన హృద్వికాసమై యెల్ల – దోషములకు వినాశకరమైన ||యేసు||
1.
సాధు మానసోల్లాసములు యేసు – నాధు గుణ దిగ్విలాసములు బోధ గొను వారి బాధ వెడలించి – మాధుర్యమగు ముక్తి సాధనములిచ్చు ||యేసు||
2.
భక్త జన లోక పూజ్యములు రక్త – సిక్త పాదపయోజములు ముక్తి రాజ్యాభిషిక్తుడై సర్వ – శక్తియుతుడైన స్వామియగు క్రీస్తు ||యేసు||
3.
దీన జన నిత్య తోషణము – సిలువ – మ్రాని ప్రభు మృత్యు పోషణము పానకము వంటి తేనియల స్వాదు – వీనులను గ్రోల మానవులకెల్ల ||యేసు||
4.
పాపులకు మంచి పక్షములు – ముక్తి – జూపు క్రీస్తు కటాక్షములు పాప సందోహ కూపమున గూలు – కాపురుషు నన్ను గాచుకొని ప్రోచు ||యేసు||