FaithWalk
← Back to Library

#137యేసు నామము మధురము

Author: పురుషోత్తము చౌదరిComposer/Ragam: మాళవCategory: క్రీస్తు నామములు — బిరుదులు
ప
యేసు నామ మెంతో మధురం – యేసు నామ మెంతో మధురం దోషములు మోసములు – నాశనమొనరించు ప్రభు ||యేసు||
1.
స్వాంతమునను శాంతి నిడును – చింతలను భ్రాంతులను వింతలుగా ద్రుంచు ప్రభు ||యేసు||
2.
నెమ్మి జేయు కమ్మి వేయు – నమ్మికలు సొమ్ములుగా ముమ్మరము జేయు ప్రభు ||యేసు||
3.
ప్రేమ లేదుగదూ క్షేమమొదవదు – కామ గుణ పామరతి లేమి చొరనీడు ప్రభు ||యేసు||
4.
మోక్ష దశకు సాక్ష్యమొసగు – నక్షయ సురక్షణకు దక్షత వహించు ప్రభు ||యేసు||
5.
శీల మతుల పాలి వెలయ – తూల జనుదోలి తన జాలి కనపరచు ప్రభు ||యేసు||