FaithWalk
← Back to Library

#136వేరొక నామమున రక్షణ లేదు

Author: గొల్లపల్లి నథానియేలుComposer/Ragam: యమునా కల్యాణిCategory: క్రీస్తు నామములు — బిరుదులు
ప
యేసు నామామృతము కన్నను – వేరే మాకింక లేదుగా దోషముల నెడబాపి పరమని – వాస పదవికి జేర్చుగా ||యేసు||
1.
నిత్య రక్షణ నిత్య జీవము – నిజముగా మార్చును సత్య సువిశేషార్థ సారము – సతతము గ్రోల కోర గనెను ||యేసు||
2.
దురిత భవమను నంధకారము – దూరముగ దోలంగ అరయగ దన విమలాత్మ వరమున – మరల మమ్ము వెలిగించెగా ||యేసు||
3.
గొప్ప కుల గర్వముల మెప్పను – తప్పుల నిరడగొట్టెను చెప్ప శక్యముగాని రక్షణ – సృష్టిలో మమ్ము నిలిపెను ||యేసు||
4.
అడ్డు పరచు పిశాచి మార్గపు – జిడ్డుల ఛేదించెను దొడ్డ కాపరి యేసు తనదగు – దొడ్డిలో మమ్ము జేర్చెను ||యేసు||