#132Angels from the realms of glory
Author: జేమ్స్ మాంట్‌గోమరి (అను: ఒంగోలు దావీదు)Category: సాయంతనారాధన
1.
రండి పాడ దూతలారా నిండు సంతోషముతో వాసిగాను దేవుడు యేసుని జన్మంబు గూర్చి ఈ భూలోకమంతట రండి నేడు పుట్టినట్టి రాజు నారాధించుడి.
2.
మందగాయు గొల్లలారా మనుష్యులతో నేడు వాసంబు చేయుచున్నాడు రండి నేడు పుట్టినట్టి రాజు నారాధించుడి.
3.
జ్ఞానులారా! మానుడిక యోచనలు చేయుట మానుగాను వెదకుడేసున్ చూచుచు నక్షత్రమున్ రండి నేడు పుట్టినట్టి రాజు నారాధించుడి.
4.
పరిశుద్ధులారా! మీరు నిరీక్షించుచుండుడి యేసు ప్రభువాలయము ఏతెంచెను చూడుడి రండి నేడు పుట్టినట్టి రాజు నారాధించుడి.
5.
పశ్చాత్తాపమొందియున్న పాపులారా మీకు విముక్తి గలిగె శక్తి నొంది రక్తి నేసున్ జేరుడి రండి నేడు పుట్టినట్టి రాజు నారాధించుడి.