FaithWalk
← Back to Library

#131Joy to the world, The Lord is come

Author: ఐజాక్ వాట్స్ (అను: జేకబ్ చేంబర్లేన్)Category: సాయంతనారాధన
1.
హల్లే లూయా, లోకమా! ప్రభు వచ్చెన్ అంగీకరించు మీ పాపాత్ములెల్ల రేసునున్ కీర్తించి పాడుడి.
2.
హల్లే లూయా రక్షకుడు ఏలును సాతాను రాజ్యమున్ నశింపజేసి మా యేసే జయంబు నొందును.
3.
పాప దుఃఖంబులెల్లను నివృత్తి చేయును రక్షణ్య సుఖక్షేమముల్ సదా వ్యాపించును.
4.
సునీతి సత్య కృపలన్ రాజ్యంబు నేలును భూజనులార మ్రొక్కండి స్తోత్రార్హుడుడాయెనె.